అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Prajavani Applications | ప్రజావాణిలో ప్రజలు సమర్పించే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
Prajavani Applications | పెండింగ్లో ఉంచవద్దు
దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా చూడాలని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 66 దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
Prajavani Applications | ఆర్డీవో కార్యాలయాల్లో…
సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 5 దరఖాస్తులు, అలాగే వేములవాడ (Vemulawada) ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి రెండు దరఖాస్తులు వచ్చాయి. ఆయా శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఎంపీడీవోల ఆధ్వర్యంలో నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బోయినపల్లి ఎంపీడీవో కార్యాలయానికి రెండు, ఇల్లంతకుంట మండలంలో ఐదు, గంభీరావుపేటలో ఐదు, ముస్తాబాద్ మండలంలో ఆరు, రుద్రంగి మండలంలో ఒకటి, తంగళ్లపల్లి మండలంలో మూడు, వీర్నపల్లి మండలంలో రెండు, వేములవాడ రూరల్ మండలంలో రెండు, ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో కార్యాలయానికి ఒక దరఖాస్తు వచ్చింది.
ఇది కూడా చదవండి..: Borewell Water Flow | భూపాలపల్లిలో ఊహించని వింత.. మోటార్ లేకుండానే బోర్ల నుంచి వస్తున్న వాటర్