Sub Registrar Bribe | ఇంటి రిజిస్ట్రేషన్​ కోసం లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన సబ్​ రిజిస్ట్రార్​

నారాయణపేట జిల్లాలో సబ్​ రిజిస్ట్రార్ లగిశెట్టి వెంకట్​స్వామి ఏసీబీ అధికారులకు చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sub Registrar Bribe | నారాయణపేట (Narayanapet) జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గ్రేడ్​ –2 సబ్​ రిజిస్ట్రార్​గా పని చేస్తున్న లగిశెట్టి వెంకట్​స్వామి ఏసీబీ (ACB) అధికారులకు చిక్కాడు. ఓ ఇంటి రిజిస్ట్రేషన్​ కోసం లంచం డిమాండ్​ చేయగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఓ వ్యక్తి ఇంటి రిజిస్ట్రేషన్​ కోసం కార్యాలయానికి వచ్చాడు. అతడిని సబ్​ రిజిస్ట్రార్​ వెంకట్​ స్వామి జూలై 18న రూ.90 వేల లంచం అడిగాడు. ప్రైవేట్ వ్యక్తి కమ్మరి నాగేశ్​ ద్వారా జూలై 21న రూ.50 వేల లంచం తీసుకున్నాడు. ఆ తర్వాత డాక్యుమెంట్ నెం. 4723/2026 ద్వారా ఫిర్యాది ఇంటి రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడం వంటి అధికారిక సహాయం చూపినందుకు మిగిలిన రూ. 40,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ (ACB) అధికారులు కేసు నమోదు చేసి సబ్ రిజిస్ట్రార్​తో పాటు ప్రైవేట్ వ్యక్తిని అరెస్ట్​ చేశారు.

Sub Registrar Bribe | భారీగా అవినీతి

రాష్ట్రంలోని పలు సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. రిజిస్ట్రేషన్​ల కోసం వచ్చే ప్రజల నుంచి అధికారులు డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే అన్ని కరెక్ట్​గా ఉన్నా.. కొర్రీలు పెడుతున్నారు. మరోవైపు లంచాలు భారీగా ఇచ్చిన వారికి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి పెట్టిన ఘటనలు ఉన్నాయి. సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో ప్రైవేట్​ వ్యక్తులకు ప్రవేశం లేదని అధికారులు చెబుతున్నా.. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. ఫేక్​ సర్టిఫికెట్లతో సైతం భూములు రిజిస్ట్రేషన్​ చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు కఠిన చర్యలు చేపట్టడం లేదు.

దీనిని కూడా చదవండి : DSP Transfers | రాష్ట్రంలో పలువురు డీఎస్పీల బదిలీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *