Rajanna Sircilla AYUSH Jobs | ఆయుష్ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఆయుష్ శాఖలో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Rajanna Sircilla AYUSH Jobs | ఆయుష్ శాఖలో (AYUSH Recruitment) నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) ద్వారా అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్(Collector Garima Agrawal) తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

Rajanna Sircilla AYUSH Jobs | 29వ తేదీలోపు..

అభ్యర్థులు తమ దరఖాస్తులను శుక్రవారం 23వ తేదీ ఉదయం 10:30 నుంచి 29వ తేది సాయంత్రం 5 వరకు కలెక్టరేట్​లోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. పీజీ మెడికల్ ఆఫీసర్ (1), ఆయుష్ మెడికల్ ఆఫీసర్ (2), డైటీషియన్ (1), సైకలాజికల్ కౌన్సిలర్ (1), యోగా ప్రొఫెషనల్ (1) పోస్టులు ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్: Rajannasiricilla.telangana.gov.in లో సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: పీస్ బాండ్ ఎందుకు జేమ్స్ బాండ్: ప్రకాష్ రాజ్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *