అక్షరటుడే, కామారెడ్డి: Alternative Crops Kamareddy | ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) సూచించారు. గురువారం సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామంలోని రైతు వేదికలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వీసీలో మాట్లాడారు.
Alternative Crops Kamareddy | భూగర్భజలాలు తగ్గినందున..
గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలమట్టం సుమారు నాలుగు నుంచి ఐదు మీటర్ల మేర తగ్గిందని కలెక్టర్ పేర్కొన్నారు. సదాశివనగర్, పెద్దకొడప్గల్, మహమ్మద్ నగర్ తదితర మండలాల్లో వర్షపాతం లోటు కారణంగా పొడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాబోయే ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు నీటి నిర్వహణ పరంగా అత్యంత కీలకమన్నారు. నిజాంసాగర్ ఆయకట్టుతో పాటు చిన్న చెరువులు, ఇతర నీటి వనరుల్లో నీటి లభ్యతను అంచనా వేసి పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాబోయే యాసంగిలో నీటి లభ్యతను బట్టి వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, జొన్న, మొక్కజొన్న, శనగ, కంది, వేరుశనగ వంటి ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు.
Alternative Crops Kamareddy | రైతులు నష్టపోయే ప్రమాదం
నీటి లభ్యతను అంచనా వేయకుండా అధిక నీరు అవసరమయ్యే పంటలను సాగుచేస్తే రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి ఇంటి వద్ద, ప్రతి గ్రామంలో వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు చేపట్టాలని, ఇంకుడు గుంతలు, వ్యవసాయ క్షేత్రాల్లో నీటి నిల్వ గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Lingampet Bus Accident | వంతెనపై బస్సు, టిప్పర్ ఢీ.. తప్పిన పెనుప్రమాదం..