Lingampet Bus Accident | వంతెనపై బస్సు, టిప్పర్ ఢీ.. తప్పిన పెనుప్రమాదం

బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటన లింగంపేట మండలంలోని ఎల్లమ్మ తండా వద్ద చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, లింగంపేట: Lingampet Bus Accident | వంతెనపై బస్సు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటన మండలంలోని ఎల్లమ్మ తండా వద్ద కేకేవై రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

Lingampet Bus Accident | అతివేగమే కారణమా..?

లింగంపేట నుంచి కామారెడ్డి (Kamareddy) వైపు వెళ్తున్న టిప్పర్, కామారెడ్డి నుంచి లింగంపేట వైపు వస్తున్న బస్సు అతివేగంగా వచ్చి ఎల్లమ్మ తండా వద్ద వంతెనపై ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 98 మంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు పేర్కొన్నారు.

భారీగా స్తంభించిన ట్రాఫిక్

కేకేవై రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ వంతెన ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం జరిగిన ప్రమాదంతో చాలాసేపటి వరకు ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి. ఎస్సై దీపక్ కుమార్ ఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్​ను క్లియర్ చేయించడంతో వాహనచోదకులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Caste Census | అవసరమైతే లెక్కలు సరిచేస్తాం.. కులగణనపై రేవంత్ కీలక వ్యాఖ్యలు!

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *