అక్షరటుడే, వెబ్డెస్క్ : Panduga Sayanna | ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న జయంతిని అక్టోబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ (Mudiraj) సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నాయకులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలిసి వినతి పత్రం సమర్పించారు.
పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని, ఆయన సేవలు, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ప్రస్తుతం ఉన్న బీసీ-డీ కేటగిరీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
Panduga Sayanna | సానుకూలంగా స్పందించిన సీఎం
ముదిరాజ్ సంఘం నాయకుల విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పండుగ సాయన్న జయంతి అధికారిక నిర్వహణతో పాటు ముదిరాజ్ సామాజిక వర్గం బీసీ-ఏ కేటగిరీకి మార్పు అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ముదిరాజ్ సామాజిక వర్గం అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : Amrit Bharat Express | ప్రయాణికులకు గుడ్న్యూస్.. కొత్తగా ఏడు అమృత్ భారత్ రైళ్లు