Amrit Bharat Express | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. కొత్తగా ఏడు అమృత్​ భారత్​ రైళ్లు

రైల్వే శాఖ కొత్తగా ఏడు అమృత్​ భారత్ ఎక్స్​ప్రెస్​ రైళ్లను ప్రారంభించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amrit Bharat Express | రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. దేశవ్యాప్తంగా ఏడు కొత్త అమృత్​ భారత్ ఎక్స్​ప్రెస్​ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో ప్రయాణ సదుపాయాలను కల్పించేందుకు వీటిని నడపడానికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.

తక్కువ ధరలో ప్రీమియం రైలు సేవలను అందించేందుకు ప్రభుత్వం అమృత్​ భారత్ రైళ్లను తీసుకొచ్చింది. ఇప్పటికే పలు మార్గాల్లో ఇవి నడుస్తున్నాయి. ఈ రైళ్లకు మంచి స్పందన వస్తుండటంతో తాజాగా రైల్వే శాఖ (Railway Department) మరో ఏడు రైళ్లను నడపాలని నిర్ణయించింది.

Amrit Bharat Express | ఈ మార్గాల్లో..

ధన్‌బాద్-కోయంబత్తూర్ మార్గంలో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (22363/22364)ను నడపనున్నారు. ఈ సర్వీసు శనివారాల్లో బయలుదేరుతుంది, అలాగే తిరుగు ప్రయాణం మంగళవారాల్లో నడుస్తుంది. గోరఖ్‌పూర్-బాంద్రా (15085/15086),గోరఖ్‌పూర్-ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (15095/15096), సుబేదర్‌గంజ్-లోకమాన్య తిలక్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (14121/14122), ప్రయాగ్‌రాజ్-ఉద్నా (20437/20438), ప్రయాగ్‌రాజ్-లోకమాన్య తిలక్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (20436/20435)రైళ్లను కొత్తగా ప్రవేశ పెట్టారు.

Amrit Bharat Express | చర్లపల్లి నుంచి..

చర్లపల్లి-గోరఖ్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (22075/22076) రైలును రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఈ రైలు తెలంగాణ– ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది. ఇది కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బల్హార్‌షా, చంద్రపూర్, నాగ్‌పూర్, బెతుల్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, ఒరై, పోఖ్రాయన్, కాన్పూర్ సెంట్రల్, ఐష్‌బాగ్, లక్నో సిటీ, గోమతీ నగర్, బారాబంకీ, గోండా వంటి అనేక ముఖ్యమైన నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైలు చర్లపల్లి –గోరఖ్‌పూర్ మధ్య శుక్రవారాల్లో నడుస్తుంది, గోరఖ్‌పూర్-చర్లపల్లి మార్గంలో ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి..: Delhi High Court | ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *