Emergency Landing | విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్​

మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్​లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్​ అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Emergency Landing | కౌలాలంపూర్ నుంచి జెడ్డాకు వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ (Malaysia Airlines) విమానం, ఇంజిన్ 2లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సోమవారం సాయంత్రం చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ MH156లో 186 మంది ప్రయాణిస్తున్నారు. గాలిలో ఉండగా.. పైలెట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో చెన్నై ఎయిర్​పోర్టు (Chennai Airport)లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి.. విమానాన్ని ల్యాండ్​ చేశారు. ల్యాండింగ్ సురక్షితంగా జరిగిందని, ప్రయాణీకులందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

Emergency Landing | బృందాల మోహరింపు

విమానం సురక్షితంగా ల్యాండ్ కావడానికి ముందు, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు, CISF సిబ్బందితో సహా అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచారు. ప్రయాణికులందరూ సురక్షితంగా విమానం దిగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక సమస్యపై ఎయిర్‌లైన్, సంబంధిత సాంకేతిక బృందాలు పరిశీలిస్తున్నాయి. ఫ్లైట్​ గాలిలో ఉండగా ఇంజన్‌లో సమస్య తలెత్తిన కారణంగా వారం లోపే ఇది రెండవ అత్యవసర ల్యాండింగ్ కావడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : Illegal Constructions | 16 అక్రమ నిర్మాణాల కూల్చివేత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *