Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు జర్మనీ సర్కారు తీపి కబురు అందించింది. జర్మనీ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే భారతీయులకు ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా (Airport Transit Visa) అవసరం లేదని తాజాగా ప్రకటించింది. ఈ సరికొత్త సడలింపు జూన్ 3వ తేదీ ( 2026 ) నుంచే అమల్లోకి రానుంది.

భారత్-జర్మనీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాన్ని, ఆర్థిక బంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల ప్రభుత్వాలు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి.

Untitled 1.jpggermen

 

Germany Transit Visa | ప్రధాని మోడీ – ఛాన్సలర్ మెర్జ్ చర్చల ఫలితం

గత (2026) జనవరిలో జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ భారతదేశ పర్యటనకు వచ్చిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఆ చర్చలే ఈ కీలక నిర్ణయానికి పునాది రాళ్లు. ఆ చర్చల ఫలితంగానే తాజాగా భారతీయులకు ట్రాన్సిట్ వీసా నుంచి మినహాయింపు లభించింది.

జర్మనీ నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ (MEA) స్వాగతించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

“జర్మనీ మీదుగా విమానాల ద్వారా ప్రయాణించే భారతీయులకు ట్రాన్సిట్ వీసా అవసరం లేదనే నిర్ణయం అమల్లోకి రావడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ కొత్త ఏర్పాట్లు భారత్-జర్మనీ దేశాల మధ్య ప్రజల బంధాలను (People-to-People ties) మరింత పటిష్టం చేస్తాయి..” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Germany Transit Visa

Germany Transit Visa | భారతీయ ప్రయాణికులకు భారీ ఉపశమనం

ప్రస్తుతం అమెరికా, కెనడా, ఇతర యూరప్ దేశాలకు జర్మనీ (ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ వంటి ప్రధాన విమానాశ్రయాల) మీదుగా వెళ్లే భారతీయ పౌరులు ట్రాన్సిట్ వీసా కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకునేవారు. దీనివల్ల అదనపు ఖర్చుతో పాటు సమయం వృథా అయ్యేది.

Germany Transit Visa | తాజా నిర్ణయంతో చేకూరే ప్రయోజనాలు

  • సులభతరమైన ప్రయాణం: జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్స్ ప్రయాణికులకు వీసా ఇబ్బందులు తప్పుతాయి.
  • ఆర్థిక ఉపశమనం: ట్రాన్సిట్ వీసా ఫీజులు, దరఖాస్తు ప్రక్రియల భారం తగ్గుతుంది.
  • పటిష్టమైన బంధాలు: రెండు దేశాల మధ్య పర్యాటకం, వ్యాపార పెట్టుబడులు మరింత వేగవంతం అవుతాయి.

ఈ చారిత్రాత్మక నిర్ణయంతో అంతర్జాతీయ ప్రయాణాలు చేసే లక్షలాది మంది భారతీయ పౌరులకు, ముఖ్యంగా విద్యార్థులు, ఐటీ నిపుణులు, పర్యాటకులకు జర్మనీ సర్కారు పెద్ద ఊరటనిచ్చిందని చెప్పొచ్చు.

Khushbu | “నడకే జిమ్‌”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *