Hyderabad company EV subsidy | ప్రధాని మోడీ పిలుపునకు హైదరాబాద్ కంపెనీ అదిరిపోయే రెస్పాన్స్.. ఈవీలు కొంటే బంపర్ సబ్సిడీ!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hyderabad company EV subsidy | దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇచ్చిన పిలుపునకు కార్పొరేట్ రంగం నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

భాగ్యనగరాని (హైదరాబాద్​) కి చెందిన ఓ ప్రముఖ ప్రైవేట్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ (అజా కన్సల్టింగ్ సర్వీసెస్) పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు దిశగా అడుగు ముందుకు వేసింది.

తమ ఉద్యోగుల్లో ఇంధన పొదుపుపై అవగాహన పెంచేందుకు సరికొత్త గ్రీన్ పాలసీని (EV Policy) ప్రకటించింది.

Hyderabad company EV subsidy | కార్‌పూలింగ్‌కు జై .. ఈవీలకు సబ్సిడీల విందు

పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణహిత ప్రయాణాలను ప్రోత్సహించేందుకు ఈ సంస్థ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.

ఆఫీసుకు వచ్చే ఉద్యోగులు ఒంటరిగా కాకుండా ‘కార్‌పూలింగ్’ (వాహనాలను పంచుకోవడం) పద్ధతిని ఎంచుకోవాలని యాజమాన్యం ప్రోత్సహిస్తోంది.

అంతేకాదు, పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) కొనుగోలు చేయాలనుకునే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంస్థ తరఫున ప్రత్యేక నగదు సబ్సిడీలను అందించేందుకు ముందుకొచ్చింది.

ఫోర్ వీలర్ (4-Wheeler EV) కొనుగోలుకు: ₹10,000 సబ్సిడీ
టూ వీలర్ (2-Wheeler EV) కొనుగోలుకు: ₹5,000 సబ్సిడీ

Hyderabad company EV subsidy | ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు

కంపెనీ తీసుకున్న ఈ పర్యావరణహిత నిర్ణయంపై ఉద్యోగుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. యాజమాన్యం కల్పిస్తున్న ఈ ఆర్థిక ఊరటతో చాలామంది ఉద్యోగులు పెట్రోల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు.

“ప్రధాని మోడీ పిలుపును కేవలం ప్రభుత్వమే కాకుండా, ప్రైవేట్ సంస్థలు కూడా బాధ్యతగా తీసుకుని ఇలాంటి ప్రోత్సాహకాలు అందించడం అభినందనీయం. ఇది దేశ ఇంధన వనరులను కాపాడటమే కాకుండా, మాకు వ్యక్తిగతంగా ప్రయాణ ఖర్చులను తగ్గిస్తుంది” అని సంస్థ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, దేశీయంగా పెరుగుతున్న ఇంధన అవసరాల నేపథ్యంలో హైదరాబాద్‌ సంస్థ ప్రారంభించిన ఈ ‘గ్రీన్ వర్క్‌ప్లేస్ మూవ్‌మెంట్’ మిగతా ఐటీ, కార్పొరేట్ కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు!

Euphoria | ‘యుఫోరియా’: సుఖ భ్రమల్లో యువత.. కన్నీటిలో మునిగిన సమాజం!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *