TGSRTC OPRS Services | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: TGSRTC OPRS Services | ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్​ఆర్టీసీ (TGSRTC) నిజామాబాద్​ రీజియన్​(nizamabad rtc) నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోందని రీజినల్​ మేనేజర్ టీ జోత్స్న తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

TGSRTC OPRS Services | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని..

ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల నుండి ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తూ.. ఓపీఆర్​ఎస్ ​(ఆన్​లైన్​ ప్యాసింజర్​ రిజర్వేషన్​ సిస్టం)ను (OPRS) అమలు చేస్తున్నట్లు ఆర్​ఎం తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలు, హైదరాబాద్ జేబీఎస్, ఎంజీబీఎస్, ఎయిర్​పోర్ట్​, తిరుపతి, విజయవాడ, భద్రాచలం తదితర ప్రాంతాలకు మొత్తం 82 ఓపీఆర్​ఎస్ ప్రత్యేక సర్వీసులను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ప్రయాణికుల అవసరాలను బట్టి రాజధాని, సూపర్ లగ్జరీ, ఈ సూపర్ లగ్జరీ(E Super Luxury), లహరి ఏసీ, లహరి(Lahari) నాన్-ఏసీ వంటి బస్సు సేవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్, శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​, జేబీఎస్, ఎంజీబీఎస్​కు అధిక సంఖ్యలో సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఆర్టీసీ వెబ్​సైట్​ (www.tgsrtcbus.in), MEE TICKET అనే మొబైల్ యాప్​లో టికెట్​ బుక్​ చేసుకోవచ్చని సూచించారు.

ఇది కూడా చదవండి: Bajaj Group Centenary | బజాజ్ గ్రూప్ శతాబ్ది ఉత్సవాలు.. దేశాభివృద్ధిలో వందేళ్ల నమ్మకమైన ప్రస్థానం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *