Drunken Driving Cases | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో 86 మందికి శిక్షలు

మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని కామారెడ్డి జిల్లా పోలీసులు హెచ్చరించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Drunken Driving Cases | మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని జిల్లా పోలీసులు హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా(Kamareddy Police) నిర్వహించిన డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో పట్టుబడిన 86 మందిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం శిక్షలు విధించింది.

Drunken Driving Cases | ముగ్గురికి జైలుశిక్ష..

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమే కాకుండా సొంత ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టే చర్య అన్నారు. ఈ కేసుల్లో ముగ్గురికి న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి మొత్తం రూ.1,30,800 జరిమానా విధించిందన్నారు. క్షణిక నిర్లక్ష్యం జీవితాంతం బాధకు కారణమవుతుందని, ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల ప్రాణాల రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, జిల్లావ్యాప్తంగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్ నుంచి.. ఫస్ట్ ఎలిమినేషన్ అతడేనా..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *