అక్షరటుడే, వెబ్‌డెస్క్ : 22-A Land Registration | రాష్ట్రంలో 22–ఏ జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. నాలా ఫీజు చెల్లించిన తర్వాత, అర్హత ఉన్న 22-ఎ భూముల రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో వేలాది ఎకరాలు నిషేధిత జాబితాలో చేరిన విషయం తెలిసిందే. దీంతో వాటి క్రయ విక్రయాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంసీ (GHMC), హెచ్ఎండీఏ, మున్సిపల్ అనుమతులు ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. తాజాగా రెవెన్యూ రికార్డులలో వ్యవసాయ భూములుగా నమోదై, నాలా ప్రక్రియను పూర్తి చేయకుండానే నివాస ప్రయోజనాల కోసం వినియోగిస్తున్న కొన్ని పట్టా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం మార్గదర్శకాలను జారీ చేసింది.
22-A Land Registration | నాలా రుసుము చెల్లించిన తర్వాత
గతంలో నాలా ప్రక్రియ పూర్తి చేయకుండా నివాస, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న భూముల యజమానులు ప్రస్తుతం నాలా రుసుము చెల్లించాలి. ఆ తర్వాత వాటి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆస్తులకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి, వర్తించే నాలా ఛార్జీలు, ఇతర రుసుములను వసూలు చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పట్టణ భూ గరిష్ఠ పరిమితికి సంబంధించిన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల విషయంలో కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దీనిని కూడా చదవండి : Asian Games Hockey | హాకీలో గోల్డ్ మెడల్.. నాలుగో స్థానంలో నిలిచిన భారత్