అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad SIR Protest | దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగానే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోందని డీసీసీ(Congress Nizamabad) అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు నగరంలోని (Nizamabad) డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు.
Nizamabad SIR Protest | 7న నిరసన ర్యాలీ
నగేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ కార్యక్రమం పూర్తిగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని అఖిల పక్షం తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆయనను తొలగించేతవరకు ఈ వారం రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలతో కలిసి వివిధ రూపాలలో నిరసనలు చేస్తామని తెలిపారు. దేశ ప్రధాని మోదీ, అమిత్ షాకు ఎన్నికల కమిషనర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
జిల్లా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం, మంగళవారం మండల కేంద్రాల్లో ధర్నా కారక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలో భారీ నిరసన ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ ఛైర్మన్ శేఖర్ గౌడ్, సీపీఐ వనమాల కృష్ణ, ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ ఏం ఎల్ నగర కార్యదర్శి సుధాకర్, సయ్యద్ ఫిరోజ్ అలీ, రఘురామ్, పిట్ల నరేష్ పాల్గొన్నారు.