అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Bathukamma Ghats | పట్టణంలోని(kamareddy) బతుకమ్మ ఘాట్ల (Bathukamma Festival) వద్ద నిరంతర విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లను, ఘాట్ వద్ద జరుగుతున్న పారిశుద్ధ్య, విద్యుత్ మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Kamareddy Bathukamma Ghats | మహిళలకు అసౌకర్యం కలగకుండా..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ ఘాట్ ల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మహిళలు వైభవంగా, సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ తరపున అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఈ పండుగకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద తాగునీటి సదుపాయం, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, మహిళల భద్రత దృష్ట్యా మున్సిపల్ సిబ్బంది, అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని చెప్పారు. ఘాట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, లోతైన నీటి ప్రాంతాల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, డీఈ హన్మంత్ రావు, ఏఈ వేణు, ఆర్వో గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: భోగి’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల..ఆకట్టుకుంటున్న ‘ఎగిలివారంగ’ పాట..!