Dharani Township Issues | నమ్మించి పనికిరాని ప్లాట్లు అంటగట్టారు.. ధరణి టౌన్ షిప్ బాధితుల ఆవేదన

ధరణి టౌన్ షిప్ పేరుతో నివాసయోగ్యం కాని స్థలాలను అధికారులు తమకు అంటగట్టారని ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Dharani Township Issues | ధరణి టౌన్ షిప్ పేరుతో నివాసయోగ్యం కాని స్థలాలను అధికారులు తమకు అంటగట్టారని ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి (Kamareddy)లోని గెలాక్సీ ఫంక్షన్ హాలులో రాజీవ్ స్వగృహ ధరణి వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

Dharani Township Issues | నివాస యోగ్యం కాని స్థలాలను..

ఈ సందర్భంగా సమావేశంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. నాలుగేళ్ల క్రితం 18 నెలల్లో అన్ని వసతులు కల్పిస్తామని, అభివృద్ధి చేసి ఇస్తామని నమ్మించి కలెక్టర్, అధికారులు తమతో ప్లాట్లు కొనుగోలు చేయించారని బాధితులు ఆరోపించారు. నివాస యోగ్యానికి పనికిరాని స్థలాలను తమకు నమ్మించి అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 500 ప్లాట్లలో 330 ప్లాట్లు కొనుగోలు చేసామని తెలిపారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు టౌన్ షిప్​లో కనీస వసతులు కల్పించలేదని, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు, రోడ్లు వేయలేదని వెల్లడించారు. ప్లాట్ల కొనుగోలు కోసం తాము రూ.లక్షల బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నామని, ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Dharani Township Issues | నిధులు మంజూరు కాక..

టౌన్ షిప్​లో మౌలిక వసతుల కల్పన కోసం అధికారులు గతంలో రూ.9 కోట్లతో ప్రతిపాదనలు పంపినప్పటికి వసతుల కల్పనకు నిధులు సరిపోవని రూ.12 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదని తెలిపారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను, ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోవడం లేదని, తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల సహకారం కోరతామన్నారు. అప్పటికి పరిష్కారం కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ సమావేశంలో రాజీవ్ స్వగృహ ధరణి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజనర్సింహ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జశ్వంత్ రావు, గౌరవ అధ్యక్షుడు కైలాస్ రాజేశ్వర్ రావు, కోశాధికారి కేదార్ నాథ్, ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.

tyut

ఇది కూడా చదవండి..: Nizamabad She Teams | ఆపద సమయంలో అతివలకు అండగా షీటీం..: సీపీ సాయిచైతన్య

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *