EHS Scheme | ఈహెచ్​ఎస్​పై భట్టి విక్రమార్క సమీక్ష

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఎంప్లాయిస్​ హెల్త్​ స్కీం పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : EHS Scheme | ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఎంప్లాయిస్​ హెల్త్​ స్కీమ్​ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆదివారం ప్రజాభవన్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత, సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈహెచ్‌ఎస్ అమలు విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు.

EHS Scheme | ఆర్థిక ఇబ్బందులు ఉన్నా..

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మానవీయ దృక్పథంతో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే 354 ఆసుపత్రులు ఉండగా, మరిన్ని ఆసుపత్రులను ఎంప్యానెల్ చేస్తున్నట్లు వెల్లడించారు. హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

దీనిని కూడా చదవండి : Nizamabad Kidnapping Case | 24 గంటల్లోనే బాలుడి కిడ్నాప్​ కేసును ఛేదించాం.. సీపీ సాయిచైతన్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *