అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad She Teams | ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాద్ షీటీం బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. జిల్లాలో షీటీం పనిచేస్తున్న విధానాన్ని వివరించారు.
Nizamabad She Teams | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో..
జిల్లాలో మహిళలు , చిన్నారుల భద్రతకై , రక్షణకై షీటీం బృందాలు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాయని సీపీ (CP Sai Chaitanya) తెలిపారు. 2026 జనవరి నుండి సెప్టెంబర్ వరకు 154 కేసులు నమోదు చేశామన్నారు. షీటీం బృందం ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ మహిళలను వేధిస్తున్న వారిపై దృష్టి సారిస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా షీ టీం బృందాలు యువతులకు, విద్యార్థులకు, పని స్థలాలలో మహిళలకు ప్రత్యేకంగా 416 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్యపర్చారన్నారు.
Nizamabad She Teams | 1,027 హాట్స్పాట్లలో తనిఖీలు
ఈ సందర్భంగా షీటీం బృందాల ద్వారా 161 ఈపెట్టి కేసుల నమోదు చేయడం జరిగిందని తెలిపారు. షీటీం బృందాలు జిల్లావ్యాప్తంగా 1,027 హాట్స్పాట్లలో తనిఖీలు చేశారన్నారు. 61 కౌన్సెలింగ్‌ల ద్వారా కేసులలో పరిష్కారం చూపబడిందన్నారు. ఆపత్కాల సమయంలో నిజామాబాద్ షీటీం బృందాలను సంప్రదించాలంటే 8712659795 నంబర్‌కు ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు. 59 గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించి మహిళల పట్ల జరిగే నేరాలపై, చైల్డ్ మ్యారేజ్, సైబర్ నేరాలపై, సోషల్ మీడియా నేరాలపై, చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహనలు కల్పించి చైతన్యపర్చామన్నారు. మహిళల సమస్యలతో దాదాపు 62 మొబైల్ ఫోన్ కాల్స్ వచ్చినట్లు వారికి తగిన సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Journalist Protection Law | జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి