అక్షరటుడే, బాన్సువాడ: Digital Classes | విద్యార్థులకు ఆధునిక విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. Kamareddy జిల్లా బాన్సువాడ పట్టణంలోని (Banswada) ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించి డిజిటల్ క్లాసులను ప్రారంభించారు.
Digital Classes | అధికారులకు పలు సూచనలు..
ఈ సందర్భంగా కళాశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థులకు అందిస్తున్న విద్యా సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత యుగంలో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలకమైందని, డిజిటల్ క్లాసులు విద్యార్థుల అభ్యసనాన్ని మరింత సులభతరం చేసి నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ప్రభుత్వం విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విద్యను అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. విద్యే భవిష్యత్తుకు బాట వేస్తుందని, ప్రతి విద్యార్థి లక్ష్యంతో కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. సమయపాలన, క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవం విజయానికి పునాది అని పేర్కొన్నారు.
Digital Classes | డిజిటల్ క్లాసులు సద్వినియోగం చేసుకోవాలి..
డిజిటల్ క్లాసులను సద్వినియోగం చేసుకొని పాఠ్యాంశాలను లోతుగా అర్థం చేసుకోవాలని, సందేహాలను వెంటనే నివృత్తి చేసుకుంటూ విద్యలో ముందుకు సాగాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు.
ఈ సందర్భంగా వెంకటాపూర్ తండాకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని లక్ష్మి మాట్లాడుతూ.. గత సంవత్సరం అక్టోబరులో హాస్టల్ నుంచి కళాశాలకు రాకపోకల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినందుకు పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే బాన్సువాడలో ఎస్‌ఆర్‌ఎన్‌కే (SRNK) డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాల వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేసి పట్టణాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నందుకు విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సలాం, కాలేజీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, బోధన సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Aug 01 Gold Rates | ఫెడ్ నిర్ణయంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో రివర్స్ ట్రెండ్ : అక్కడ తగ్గుదల..ఇక్కడ పెరుగుదల