Paddy Crop Damage | వరిపంట నష్టపోయేలా విషపూరిత రసాయనాల పిచికారి.. పోలీసులకు ఫిర్యాదు

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Paddy Crop Damage | వరిపంటకు నష్టం వాటిల్లేలా విషపూరిత రసాయనాలు పిచికారీ చేయడంతో పచ్చని పొలం కాస్త ఎండిపోయిది. ఈ ఘటన డిచ్​పల్లి (Dichpally) మండలంలోని సాంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

Paddy Crop Damage | రసాయనాలు పిచికారీ..

డిచ్‌పల్లి మండలం సాంపల్లి గ్రామంలో రైతు సంగి గోపాల్‌కు చెందిన వరి పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత విషపూరిత రసాయనాలను పిచికారి చేశారు. దీంతో వరి పైరు తీవ్రంగా దెబ్బతిని ఎండిపోయింది. వరి పంటకు నష్టం జరిగిన విషయాన్ని గుర్తించిన బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై అరీఫ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.  ఘటనకు సంబంధించి అనుమానితులు ఎవరైనా ఉన్నారా అనే విషయమై రైతును అడిగి వివరాలు తెలుసుకున్నారు. దుండగులు అత్యంత విషపూరిత రసాయనాలు పిచికారీ చేయడంతోనే వరి పైరు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయినట్లు ఏఈవో జ్ఞానేశ్వర్ ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇది కూడా చదవండి: ఇయర్ బడ్స్ అస్సలు సేఫ్ కాదు… 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *