అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bathukamma Celebrations | బతుకమ్మ వేడుకలను ఈనెల 10 నుంచి 18 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్ సంజయ్ జాజు వెల్లడించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ.. ఈ నెల 18న ట్యాంక్ బండ్‌పై వేలాది మంది మహిళలతో సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చి ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారన్నారు.వందలాది మంది కళాకారులు సైతం ఈ వేడుకలో పాల్గొంటారని చెప్పారు. బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు.
Bathukamma Celebrations | ఇబ్బందులు లేకుండా..
ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ వేడుకలకు వేలాది మంది మహిళలు వచ్చే అవకాశం ఉంది. దీంతో వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. బతుకమ్మ ఘాట్‌లో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. 18న సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల మధ్య ట్యాంకు బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నందున ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలన్నారు. అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్ బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని సూచించారు.
దీనిని కూడా చదవండి : 22-A Land Registration | 22-ఏ భూముల రిజిస్ట్రేషన్‌పై కీలక అప్డేట్