Sheikh Hamdan | ఎంతో ఆప్యాయత.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను పరామర్శించిన UAE ఉప ప్రధాని హమ్దాన్

చికిత్సలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులను హమ్దాన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sheikh Hamdan | అబుదాబి Abu Dhabi లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధాన మంత్రి షేక్ హమ్దాన్ పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన ఆయన.. కెప్టెన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

చికిత్సకు సంబంధించిన వివరాలతో పాటు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న అంశాలపై వైద్యులతో హమ్దాన్ చర్చించారు. కెప్టెన్‌కు అందుతున్న వైద్య సేవలను కూడా పరిశీలించినట్లు సమాచారం.

Sheikh Hamdan | చికిత్సలో లోటు లేకుండా చూడాలని ఆదేశాలు..

స్మిత్ మచ్చర్‌కు అవసరమైన వైద్య సహాయం, చికిత్సలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులను హమ్దాన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

బాధితుడి పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉన్నతస్థాయి నుంచి పరామర్శించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

Samantha Seemantham | సీమంతంలో శ్రీవిద్యా సొబగులు..కళా ఆవరణలో మాతృత్వానికి దైవత్వపు అభిషేకం!

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *