Bhatti Vikramarka | వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి : డిప్యూటీ సీఎం భట్టి

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhatti Vikramarka | రాష్ట్రంలో వనరుల సమీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రభుత్వ భూముల విలువను పెంచే అవకాశాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకునే చర్యలు చేపట్టాలని సూచించారు.

Bhatti Vikramarka | పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి..

అలాగే పర్యాటక రంగాన్ని రాష్ట్రానికి కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహం ద్వారా ఈ రంగంలో మరిన్ని అవకాశాలను సృష్టించాలని అధికారులకు సూచించారు.

Sheikh Hamdan | ఎంతో ఆప్యాయత.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను పరామర్శించిన UAE ఉప ప్రధాని హమ్దాన్

పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తూ, ప్రభుత్వ వనరులను సమర్థంగా వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *