అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Lorry Accident | ఆలుగడ్డల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన టేక్రియాల్ బైపాస్ శివారులో 44వ జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది.
Kamareddy Lorry Accident | నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా..
నాగపూర్ నుంచి హైదరాబాద్ (Hyderabad) వైపు ఆలుగడ్డలను తీసుకువెళ్తున్న క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కకు ఒరిగి పడిపోయింది. లారీలో ఉన్న ఆలుగడ్డల బస్తాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: TNGOS Ganesh Celebrations | టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల నిర్వహణ అభినందనీయం