Free Bus Travel | వృద్ధులకు ఉచిత బస్సు సౌకర్యం!

ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Free Bus Travel | రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో (Mahalaxmi Scheme) భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్​ప్రెస్​ బస్సులో దీనిని అమలు చేస్తున్నారు. నిత్యం వేలాది మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. పేద, మధ్య తరగతి వారికి ఈ పథకం ఎంతో మేలు చేస్తోంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న యవతులు, మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు సైతం ఫ్రీ బస్ అమలు చేయాలని యోచిస్తోంది.

Free Bus Travel | పొన్నం ప్రకటన

మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సేవలు, నిత్యావసర సౌకర్యాలను పొందడానికి ప్రజా రవాణాపై ఆధారపడే పెన్షనర్లు, ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులు, ఒంటరిగా నివసించే వృద్ధులకు ఇది ఊరట కలిగిస్తుంది.

Free Bus Travel | పాస్​లు ఇచ్చి..

ప్రస్తుతం మహిళలకు ఆధార్​ కార్డు ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆధార్​ కార్డు చూపిస్తే ఆర్డినరీ, ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో ఉచిత టికెట్​తో ప్రయాణం చేయవచ్చు. అయితే వృద్ధులకు మాత్రం పాస్​ విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అర్హత ఉన్న వృద్ధులు దరఖాస్తు చేసుకుంటే వారికి పాస్​లు అందిస్తారు. వాటిని చూపడితే బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తారు.

Free Bus Travel | బస్సుల సంఖ్య పెంచాలి

ప్రస్తుతం మహాలక్ష్మీ పథకంలో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. నిత్యం బస్సులు రద్దీగా ఉంటున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా బస్సులు లేక నిలబడి ప్రయాణాలు చేస్తున్నారు. రద్దీతో ప్రయాణికులతో పాటు కండక్టర్లు, డ్రైవర్లు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులకు ఉచితంగా బస్​ అమలు చేస్తే మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి : 22-A Land Registration | 22-ఏ భూముల రిజిస్ట్రేషన్​పై కీలక అప్​డేట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *