అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | సమాజ్‌వాది పార్టీ (SP) ప్రతాప్‌గఢ్ ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్‌బరేలి నుంచి పోటీ చేయడానికి రాహుల్ గాంధీ భయపడ్డారని ఆయన అన్నారు. తమ పార్టీతో పొత్తు లేకపోతే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచేది కాదన్నారు.
పార్లమెంట్ 2024 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ 37, బీజేపీ 33, కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథిలో ఓడిపోయారు. దీంతో 2024లో ఆయన రాయ్‌బరేలితో పాటు వయనాడ్‌లో పోటీ చేశారు. రెండో చోట్ల విజయం సాధించిన ఆయన వయనాడ్‌ను వదులుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎస్పీ ఎంపీ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఒక దశలో తన సీటును వదులుకోవడానికి సిద్ధపడ్డారని, తమ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భరోసా ఇవ్వడంతోనే పోటీ చేశారన్నారు.
Rahul Gandhi | ఏళ్ల నుంచి..
తమ మద్దతు లేకపోతే నెహ్రూ కుటుంబానికి చెందినదిగా భావించే ఆ సంప్రదాయ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆయన ఏమాత్రం ఆసక్తి చూపలేదని శివ్‌పాల్ అన్నారు. కాగా ఈ స్థానంలో గతంలో రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీ, తల్లి సోనియా గాంధీ పోటీ చేశారు. అలాంటి చోట పోటీ చేయడానికి సైతం రాహుల్ వెనుకడుగు వేశారని ఎస్పీ ఎంపీ అన్నారు.
Rahul Gandhi | ఎన్నికల వేళ..
యూపీలో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ ప్రస్తుతం ఇండియా కూటమిలో కొనసాగుతున్నాయి. పొత్తులో భాగంగా తమకు కనీసం 150 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది. మరోవైపు 55 సీట్లకు మించి ఇచ్చేది లేదని ఎస్పీ చెబుతోంది. ఈ క్రమంలో ఎంపీ శివ్‌పాల్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వారు 50 కంటే ఎక్కువ సీట్లు అడగకూడదు, ఉన్నదానితో సంతోషంగా ఉండాలని ఆయన అన్నారు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 255, ఎస్పీకి 101 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకపోయిన తమకు పెద్ద నష్టం ఉండదని ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిని కూడా చదవండి : G7 Oil Release | 100 మిలియన్ బ్యారెళ్ల విడుదలకు G7 నిర్ణయం..చమురు ధరలకు కళ్లెం పడుతుందా?