అక్షరటుడే వెబ్‌డెస్క్:Kerala New CM|కేరళ రాజకీయాల్లో సరికొత్త పాలన మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం వైభవంగా జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీడీ సతీశన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.కొలువుదీరిన మంత్రివర్గం..
ముఖ్యమంత్రితో పాటుగా పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా అదే వేదికపై ప్రమాణ స్వీకారం చేసింది. సీఎం వీడీ సతీశన్‌తో కలుపుకుని మొత్తం 20 మంది నేతలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ అర్లేకర్ వారందరితో దైవసాక్షిగా ప్రమాణం చేయించారు.
Kerala New CM|హాజరైన ప్రముఖులు..
ఈ చారిత్రాత్మక వేడుకకు దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలివచ్చారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కార్యక్రమానికి విచ్చేసి కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ వేడుకకు హాజరై నూతన సీఎం సతీశన్‌కు అభినందనలు తెలపడం విశేషం.
ఇది కూడా చదవండి: US Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ జిల్లా యువతి మృతి


