SU-57 Fighter Jets | ఎస్​యూ–57 యుద్ధ విమానాలు.. భారత్​కు రష్యా బిగ్​ ఆఫర్​..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: SU-57 Fighter Jets | భారత్​కు రష్యా బిగ్​ ఆఫర్​ ఇచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సుఖోయ్ ఎస్‌యూ-57 జెట్ విషయంలో ఒక కీలకమైన ప్రతిపాదన చేశారు. మెరుగైన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన ఎస్‌యూ-57ను భారత్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేయడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి రష్యా సుముఖంగా ఉందని ప్రకటించారు.

ప్రస్తుతం భారత వైమానిక దళం (IAF) వద్ద ఎలాంటి 5వ తరం యుద్ధ విమానాలు లేవు. అంతేకాకుండా, పాకిస్థాన్ త్వరలో చైనాకు చెందిన షెన్యాంగ్ జె-35ఏఈ స్టెల్త్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తుందనే ఊహాగానాలు ఆందోళనలను పెంచాయి. స్వదేశీ 5వ తరం జెట్ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్)ను అభివృద్ధి చేసేందుకు భారత్​ (India) చేపట్టిన ప్రాజెక్ట్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఈ క్రమంలో పుతిన్​ యుద్ధ విమానాలపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

SU-57 Fighter Jets | సిద్ధంగా ఉన్నాం

SU-57 Fighter Jets

ఈ విమానాన్ని భారతదేశానికి సరఫరా చేయడానికి, దానిని అభివృద్ధి చేస్తూనే ఉండటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఎలాంటి సమస్యలు, పరిమితులు లేవు. వాయు రక్షణ వ్యవస్థల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది అని పుతిన్ అన్నారు. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారానికి ఎటువంటి పరిమితులు లేవని రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు. అమెరికా సైతం తన ఎఫ్​–35 యుద్ధ విమానాలను భారత్​కు విక్రయించాలని చూస్తోంది. ఈ క్రమంలో రష్యా ఎస్​యూ–57 జెట్లను కలిసి రూపొందించడానికి సిద్ధం అని ప్రకటించడం గమనార్హం. మరోవైపు భారత్​, రష్యా కలిసి బ్రహ్మోస్​ క్షిపణులను రూపొందిస్తున్నాయి. పుతిన్ తాజా ప్రతిపాదనతో, భారత్ తన ఆయుధాగారంలో అత్యున్నత రష్యన్ స్టెల్త్ యుద్ధ విమానాన్ని చేర్చుకుంటుందా లేదా అనేది చూడాలి.

ఇది కూడా చదవండి..: Ebola Outbreak Congo | ఎబోలా విజృంభణ వేళ.. ఐసోలేషన్ నుంచి 11 మంది పరార్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *