Grand Canyon Floods | అమెరికాలో ఆకస్మిక వరదలు.. 20 మందికి పైగా గల్లంతు!

అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Grand Canyon Floods | అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఉప్పొంగుతున్న వరదల కారణంగా 20 మందికి పైగా గల్లంతు కావడం కలకలం రేపింది. బ్రైట్ ఏంజెల్ కాన్యన్, ఫాంటమ్ రాంచ్ ప్రాంతాలను ఈ ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరద ఉధృతికి పెద్ద బండరాళ్లు, లోహపు కట్టడాలు కొట్టుకుపోయి కోలరాడో నదిలో కలిశాయని నేషనల్ పార్క్ సర్వీస్ అధికారులు వెల్లడించారు.

Grand Canyon Floods | వరదకు కారణాలు..

శనివారం మధ్యాహ్నం ఆ ప్రాంతంలో కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే అర అంగుళం నుంచి అంగుళం వరకు భారీ వర్షం కురిసింది. ఆ రాతి ప్రాంతంలో ఎత్తు నుంచి లోయలోకి పడే తీవ్ర వాలు కారణంగా వర్షపు నీరు క్షణాల వ్యవధిలోనే నదిలోకి పోటెత్తింది. ఉత్తర వైపు ఉన్న గ్రాండ్ కాన్యన్ నుంచి బ్రైట్ ఏంజెల్ క్రీక్ ద్వారా కోలరాడో నదిలోకి సుమారు 6,000 అడుగుల ఎత్తు నుంచి ఈ వరద నీరు దూసుకొచ్చింది.

Grand Canyon Floods | సహాయక చర్యలు..

ప్రమాదకర పరిస్థితిని గమనించిన అధికారులు అరిజోనా అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఫాంటమ్ రాంచ్ ప్రాంతం నుంచి 62 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం వరకు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనివల్ల మరోసారి వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా బ్రైట్ ఏంజెల్ క్యాంప్‌గ్రౌండ్, ఫాంటమ్ రాంచ్, నార్త్ కైబాబ్ ట్రైల్స్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కోలరాడో నదిపై జరిగే రాఫ్టింగ్ ట్రిప్స్‌ను కూడా నిలిపివేశారు. గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి:  Delhi Bus Rape Case | కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్‌రేప్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *