అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran President Masoud Pezeshkian | ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశం అయ్యారు. కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్‌కెక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా వీరు ఇద్దరు పలు అంశాలపై చర్చించారు.
ఫిబ్రవరిలో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ప్రధాని మోదీ (PM Modi) తొలిసారి ఇరాన్ అధ్యక్షుడితో ప్రత్యక్షంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించారనే వివరాలు తెలియరాలేదు. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తత, హర్ముజ్ జలసంధిలో దిగ్భందనం, విదేశీ నౌకలపై దాడులు తదితర అంశాలపై చర్చ జరిగి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
Iran President Masoud Pezeshkian | మద్దతు కోసం..
అమెరికా దూకుడుకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే లక్ష్యంతో పెజెష్కియాన్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు అయ్యారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే ఏ విధమైన దూకుడుకైనా బలం, సంకల్పంతో స్పందిస్తుందని పెజెష్కియాన్ పేర్కొన్నారు. సంఘర్షణకు చర్చల ద్వారా పరిష్కారం లభించాలని కోరుకుంటున్న పెజెష్కియాన్, అదే సమయంలో టెహ్రాన్ “దురాక్రమణదారులకు గట్టిగా స్పందిస్తుందని” నొక్కి చెప్పారు.
Iran President Masoud Pezeshkian | ఆర్మేనియా ప్రధానితో..
ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఆర్మేనియా ప్రధాన మంత్రి నికోల్ పాషిన్యన్‌తో కూడా సమావేశమయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య వంటి వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఆ ఇద్దరు నాయకులు చర్చించారు. ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్నారు.
ఇది కూడా చదవండి..: Grand Canyon Floods | అమెరికాలో ఆకస్మిక వరదలు.. 20 మందికి పైగా గల్లంతు!