Chicken Pieces Dispute | చికెన్​ ముక్కలు ఎక్కువ తిన్నాడని స్నేహితుడి హత్య

చికెన్​ ముక్కలు ఎక్కువగా తిన్నాడని ఓ వ్యక్తి తన మిత్రుడిని హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chicken Pieces Dispute | ఇద్దరు స్నేహితులు కలిసి పార్టీ చేసుకున్నారు. అందులో ఒకరు ఎక్కువ చికెన్​ ముక్కలు తిన్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. అది తీవ్ర రూపం దాల్చి ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన కర్ణాటక (Karnataka)లోని బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది.

ముదలగి తాలూకాలోని హునశ్యాల్ పిజి గ్రామంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తిని అతని స్నేహితుడే కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా కబీర్‌గంజ్ గ్రామానికి చెందిన సీతారామ్‌, అరుణకుమార్​ ముదలగిలోని ప్రియా స్టీల్ కంపెనీలో పని చేస్తున్నారు. ఆ ఇద్దరు స్నేహితులు పార్టీ చేసుకుంటుండగా, ఒకరు మరొకరి కంటే ఎక్కువ చికెన్ ముక్కలు తిన్నారనే విషయంలో వారి మధ్య వాదన మొదలైంది.

Chicken Pieces Dispute | కత్తితో పొడిచి..

ఇద్దరి మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అరుణ్ కుమార్ కత్తి తీసి సీతారామ్ చాతీపై పొడిచాడు. ఆ తర్వాత అతడు భవనంపై నుంచి పడిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన సీతారామ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిత్రీకరించేందుకు యత్నించినా.. పోలీసుల విచారణలో అరుణ్​ కుమార్​ నిజం ఒప్పుకున్నాడు. కాగా చికిత్స పొందుతూ సీతారామ్​ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Supreme Court Protest Plea | నిరసనలను వాయిదా వేయాలని పిటిషన్​.. తిరస్కరించిన సుప్రీంకోర్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *