Boat accident | నార్త్‌ సైప్రస్‌ తీరంలో బోటు బోల్తా.. ఆరుగురు మృతి

టర్కీ ఆధీనంలో ఉన్న ఉత్తర సైప్రస్ తీరంలో ఓ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Boat accident | టర్కీ (Turkey) ఆధీనంలో ఉన్న ఉత్తర సైప్రస్ (Cyprus) తీరంలో ఓ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురిని అధికారులు రక్షించారు.

దాదాపు 270 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న ఫెర్రీ బోల్తా పడటంతో కనీసం ఆరుగురు మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. 172 మందికి పైగా ప్రజలను రక్షించినట్లు ఆ ప్రాంత ప్రధానమంత్రి ఉనాల్ ఉస్టెల్ తెలిపారు. ఈ ఫెర్రీ ఫిలో డెనిజ్‌సిలిక్ కంపెనీకి చెందింది. డయానా బీచ్ వద్ద మునిగిపోయిందని కైరేనియా మేయర్ మురత్ షెంకుల్ తెలిపారు. తీరానికి సుమారు 7.5 కిలోమీటర్ల దూరంలో ఫెర్రీ లోపలికి నీరు లోపలికి రావడం ప్రారంభమైందని సమాచారం. దీంతో ప్రయాణికులు నీటిలో దూకారు.

Boat accident | 89 మంది గల్లంతు

ఫెర్రీ బోల్తా పడిందనే సమాచారం మేరకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 172 మందిని కాపాడాయి. గాయపడ్డ పలువురిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 89 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు.

 

దీనిని కూడా చదవండి : Mojtaba Khamenei | నిజమైన శత్రువును గుర్తించండి.. ముస్లిం దేశాలకు ఖమేనీ లేఖ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *