BRS Meeting | ఎర్రవెల్లి ఫామ్​హౌజ్​లో బీఆర్​ఎస్​ఎల్పీ భేటీ.. పొంగులేటి విమర్శలు

ఎర్రవెల్లిలోని ఫామ్​హౌజ్​లో కేసీఆర్​ బీఆర్​ఎస్ శాసనసభ పక్ష సమవేశం నిర్వహించనున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS Meeting | ఎర్రవెల్లిలోని ఫామ్​హౌజ్​లో కేసీఆర్​ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం బీఆర్​ఎస్ శాసన సభ పక్ష సమవేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 7 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు ఇప్పటికే తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కేసీఆర్ (KCR)​ అసెంబ్లీకి రావాలని, లేకపోతే రాజీనామా చేయాలని కాంగ్రెస్​ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్​ఎస్​ఎల్పీ భేటీ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

BRS Meeting | రాచరికాన్ని తలపిస్తోంది

బీఆర్​ఎస్​ఎల్పీ భేటీని ఫామ్ హౌస్​లో నిర్వహించడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు కూడా ఫాంహౌస్​లోనే నిర్వహించమంటారా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​ నాయకులు వ్యవహరిస్తున్న తీరు రాచరిక రోజులను తలపిస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో 1000 రోజులలో రూ. 1 కోటికి పైగా ప్రజాధనాన్ని జీతంగా తీసుకుని, రూ. 21 కోట్లకు పైగా భద్రత, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టినా, శాసనసభకు హాజరుకాకుండా పూర్తిగా ఫాంహౌస్ కే పరిమితమై కేసీఆర్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ధోరణి కొనసాగితే… రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా ఫాం హౌస్‌ లోనే నిర్వహించాలని కేసీఆర్ డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు.

దీనిని కూడా చదవండి : Sudivya Kumar | గుండెపోటుతో జార్ఖండ్​ విద్యాశాఖ మంత్రి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.