అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Hari Babu Murder | రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి (YouTuber Vaishnavi Case) హత్య కేసులో నిందితుడు నిజామాబాద్ (Nizamabad) నగరంలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నగరంలో సంచలనం రేపింది.
Hari Babu Murder | ప్రేమ పెళ్లి చేసుకుని..
కోరుట్లకు చెందిన ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి, హరిబాబు 2025లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2026 మార్చి 17వ తేదీన వైష్ణవి ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. కత్తితో దాడి చేసి హరిబాబు ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ క్రమంలో పోలీసులు సాక్ష్యాధారాలతో హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి తల్లి, అన్నలు చెప్పినట్లు విని హరిబాబు తరచూ వైష్ణవిని అదనపు కట్నం కోసం వేధించేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసులు విచారణలో తేల్చారు. అనంతరం అతడు రిమాండ్ నుంచి బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
Hari Babu Murder | రెక్కి చేసి.. వేటు వేసి..
అయితే హరిబాబు నిజామాబాద్‌కు వచ్చినట్లుగా తెలుసుకున్న ముగ్గురు ఆగంతకులు కారులో వచ్చి నగరంలోని రాజారాజేంద్ర వద్ద రోడ్డు పక్కన నిలబడ్డ హరిబాబుపై దాడి చేశారు. తమ వెంట తెచ్చుకున్న కత్తితో వేటు వేసి హతమార్చారు. అనంతరం క్షణాల్లోనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. హత్య చేసిన వ్యక్తుల వివరాలు తెలియరాలేదు.
ఇది కూడా చదవండి : ఘాట్ రోడ్డులో ప్రమాదం మహిళ మృతి