Ampere Experience Centre | కడపలో ఆంపియర్ ఇ-స్కూటర్ల కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం

కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ (ITI Circle) వద్ద 'పద్మావతి మోటార్స్' పేరిట ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఆంపియర్ (Ampere) తమ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ampere Experience Centre | కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ (ITI Circle) వద్ద ‘పద్మావతి మోటార్స్’ పేరిట ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఆంపియర్ (Ampere) తమ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది. రాయలసీమ ప్రాంతంలో ఇ-మొబిలిటీని మరింత సులభంగా, వేగంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (Greaves Electric Mobility) ఈ విక్రయ, సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

Ampere Experience Centre | సేల్స్ , సర్వీస్ సౌకర్యం..

వినియోగదారులకు మెరుగైన కొనుగోలు అనుభవాన్ని అందించేందుకు ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అమ్మకాలతో పాటు పూర్తిస్థాయి సర్వీసింగ్ సదుపాయాలను ఒకే చోట అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాంగణంలో శిక్షణ పొందిన నిపుణులు ఇ-స్కూటర్ల విశేషాలను వివరించడంతో పాటు, వినియోగదారులు సరైన వాహనాన్ని ఎంచుకునేలా అవగాహన కల్పిస్తారు.

Ampere Experience Centre | ఇ-స్కూటర్లు పరిచయం..

వివిధ వర్గాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా తయారుచేసిన పలు మోడళ్లను ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో అందుబాటులో ఉంచారు.

ఆంపియర్ నెక్సస్ ఇఎక్స్+ (Ampere Nexus EX+): 5 kW శక్తివంతమైన మోటార్ కలిగి, క్లిష్టమైన రహదారులపై కూడా అత్యుత్తమ పనితీరు కనబరిచి అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పింది.

మాగ్నస్ జీమాక్స్ (Magnus GMax): కుటుంబాలకు, విలువ ఆధారిత కస్టమర్లకు అనుకూలంగా ప్రాక్టికల్ అండ్ కనెక్టెడ్ టెక్నాలజీతో రూపొందించబడింది.

మాగ్నస్ నియో (Magnus Neo): నగర ప్రయాణాల్లో రోజువారీ సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోసం దీనిని డిజైన్ చేశారు.

ఆంపియర్ రియో వైబ్ (Ampere Reo Vyb): ఇటీవల విడుదలైన ఈ మోడల్ ముఖ్యంగా విద్యార్థులు, యువతను ఆకట్టుకునేలా ఉంది.

Ampere Experience Centre | ఎల్ఎఫ్పీ బ్యాటరీ భద్రత..

ఆంపియర్ నెక్సస్ ఇఎక్స్+, మాగ్నస్ జీమాక్స్ వేరియంట్లలో ఇంటెల్లిప్యాక్ (Intellipack) ద్వారా 30కి పైగా స్మార్ట్ , కనెక్టెడ్ ఫీచర్లను అందించారు. అత్యంత సురక్షితమైన నెక్స్ట్-జెన్ ఎల్ఎఫ్పీ (LFP) బ్యాటరీ టెక్నాలజీతో పనిచేసే ఈ వాహనాలకు ఏకంగా 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల ప్రామాణిక బ్యాటరీ వారంటీని సంస్థ ఆఫర్ చేస్తోంది.

Ampere Experience Centre | పనితీరు..

‘భారత్ కీ స్మార్ట్ రైడ్’ నినాదంతో వస్తున్న ఆంపియర్ వాహనాలు భారతీయ  ( India ) రహదారులపై తమ సత్తా నిరూపించుకున్నాయి. మాగ్నస్ జీమాక్స్ స్కూటర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని డాంగ్ వ్యాలీ నుంచి గుజరాత్‌లోని గుహార్ మోటీ వరకు 15 రోజుల్లో దాదాపు 4,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది. అలాగే, ఆంపియర్ నెక్సస్ మోడల్ కొల్లి హిల్స్‌లోని 70 హెయిర్‌పిన్ బెండ్లను అధిగమించడమే కాకుండా, 13,200 అడుగుల ఎత్తులోని షిప్కీ లా పాస్‌ను చేరుకుని తన శక్తివంతమైన పనితీరును చాటుకుంది.

ఇది కూడా చదవండి: Indiramma Houses | త్వరలో ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లులు : మంత్రి పొంగులేటి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *