Bonded Labour Rescue | కార్మికులకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించిన జిల్లా న్యాయమూర్తి..

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Bonded Labour Rescue | ఇటుక బట్టీల్లో కొన్ని నెలలుగా నిర్బంధంగా వెట్టిచాకిరి చేస్తున్న కార్మికులకు జిల్లా న్యాయమూర్తి భరతలక్ష్మి (Judge Bharatalakshmi) విముక్తి కల్పించారు. ఈ మేరకు మంగళవారం ఆర్మూర్​ నియోజకవర్గంలోని దేగాంలో ఉన్న బట్టీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వందల సంఖ్యలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కూలీలతో మాట్లాడారు. నిర్బంధంగా పనిచేస్తున్నట్లుగా గుర్తించిన ఆమె జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వారిని సొంతూళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

Bonded Labour Rescue | రేకుల షెడ్​లలో.. కనీస సౌకర్యాల్లేకుండా..

జిల్లా న్యాయమూర్తి భరత లక్ష్మి మాట్లాడుతూ దేగాం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలను సందర్శించగా ఇక్కడ ఘోరమైన పరిస్థితులు కనిపించాయన్నారు. కొన్ని నెలలుగా కార్మికులను బట్టీల్లోని రేకుల షెడ్​లో ఎలాంటి సౌకర్యాలు లేకుండా చిన్నపిల్లలతో సహా ఉంచుతున్నారన్నారు. వారి దయనీయ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుందన్నారు.

Bonded Labour Rescue

Bonded Labour Rescue | సరైన పనివేళలు లేకుండా..

బట్టీల్లో పనిచేస్తున్న నిర్బంధ కార్మికులకు సరైన పనివేళలు ఇవ్వకుండా రాత్రింబవళ్లు వారితో పనిచేయించుకుంటున్నట్లుగా తెలుస్తోందన్నారు. ఇటుక బట్టిలో 20మంది కార్మికులు పనిచేస్తున్నట్లుగా లైసెన్స్​ తీసుకుని వందల సంఖ్యలో పనివాళ్లతో నిర్బంధంగా పనిచేయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇక్కడ నిర్బంధంగా పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇటుక బట్టీ నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్నిరోజులుగా వారి పనిచేసిన దానికి డబ్బులు ఇప్పిస్తామన్నారు.

Bonded Labour Rescue

ఇది కూడా చదవండి..: Double Bedroom Houses | ఇళ్ల పట్టాల పంపిణీలో జాప్యంపై లబ్ధిదారుల నిరసన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *