Kapra Cylinder Blast | సిలిండర్ పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kapra Cylinder Blast | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం సిలిండర్​ పేలి ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

నగరంలోని కాప్రా చౌరస్తాలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ (Fast Food Center)లో తెల్లవారుజామున సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిపై శకలాలు పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ లీకేజీయే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Kapra Cylinder Blast | భయంతో పరుగులు

స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ సిలిండర్ పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా తెల్లవారుజామున ఒకసారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియక భయంతో పరుగులు తీశారు.

ఇది కూడా చదవండి..: ORR Rash Driving | ‘రీల్స్’ పిచ్చి: ఓఆర్‌ఆర్‌పై 200 కి.మీ వేగంతో మృత్యు విన్యాసాలు.. యువకుడి అరెస్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *