Overseas Vidyanidhi Scheme | విదేశాల్లో విద్యకు సువర్ణావకాశం.. ‘విద్యానిధి’ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Overseas Vidyanidhi Scheme | విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలి అనుకునే బీసీ (BC), ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా స్కాలర్​షిప్​ అందిస్తోంది.

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనుండగా, అందులో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారని వెల్లడించింది. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్/పీహెచ్‌డీ వంటి ఉన్నత కోర్సులు అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ సూచించింది.

Overseas Vidyanidhi Scheme | అర్హతలు ఇవే..

ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. 35 ఏళ్లలోపు వరకు అర్హులు. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. GRE-260 లేదా GMAT-500 స్కోర్ ఉండాలి. TOEFL-60 మార్కులు, IELTS-6.0 లేదా PTE-50 మార్కులు స్కోర్ ఏదైనా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్​ 30లోపు ఆన్​లైన్​ ద్వారా అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం http://telanganaepass.cgg.gov.in వెబ్​సైట్​ను సందర్శించాలి.

Overseas Vidyanidhi Scheme | రూ.20 లక్షల సాయం

ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక కమిటీ పరిశీలిస్తుంది. మెరిట్​ జాబితా ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తోంది. ఈ పథకానికి ఎంపిక అయితే విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ప్రభుత్వం అందిస్తుంది. దీంతోపాటు విమాన, వీసా ఖర్చులను భరిస్తుంది.

దీనిని కూడా చదవండి : Delhi Model Murder | ఢిల్లీలో మోడల్ హత్య.. నిందితుడి అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *