అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Car Stunts | హైదరాబాద్ (Hyderabad) నగరంలో పలువురు యువకులు కార్లు, బైక్‌లతో ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్లో రాత్రిపూట రాహదారులను రేసింగ్ ట్రాక్‌లుగా మారుస్తున్నారు. వేగంగా వాహనాలను నడుపుతూ ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్‌లో వాహన స్టంట్స్‌పై పోలీసులు సీరియస్ యాక్షన్ చేపట్టారు. బిజీ ఏరియాల్లో రాత్రి పూట మోహరించి స్టంట్స్ చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు. శనివారం రాత్రి మాదాపూర్ (Madhapur)లని నీలోఫర్ కేప్ వద్ద కొందరు కార్లతో రేసింగ్ చేశారు. భారీ సౌండ్‌తో యువకులు హంగామా చేశారు. ఈ క్రమంలో అడ్డుకోవడానికి యత్నించిన పోలీసులపై దూసుకెళ్లారు.
Hyderabad Car Stunts | పలువురి అరెస్ట్..
రేసర్లు కార్లతో పోలీసులపైకి దూసుకు వచ్చారు. దీంతో రమేశ్ అనే కానిస్టేబుల్‌కు గాయలు అయ్యాయి. పోలీసులు రేసింగ్‌కు పాల్పడుతున్న కార్లను వెంబండించారు. హోండా సిటీతో రేసింగ్ చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోతున్న వాహనాలను పోలీసులు అడ్డగించి, నిందితులలో కొందరిని బయటకు తీయడానికి కార్ల కిటికీలను పగలగొట్టారు.
Hyderabad Car Stunts | చర్యలు తీసుకోవాలి
రేసర్లను అదుపులోకి తీసుకురావడానికి స్వల్పంగా బలప్రయోగం చేశారు. వారాంతపు అర్ధరాత్రి రేసింగ్‌లు హైదరాబాద్‌లో ఒక ప్రధాన ఆందోళనగా కొనసాగుతున్నాయి. స్టంట్ రైడర్లు, రేసర్లు నగర రహదారులపై భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
#Hyderabad: #Midnight chaos near #NilouferCafe in #Madhapur as #reckless drivers turned city roads into a #racingtrack during the weekend.
Groups of #youths allegedly performed #dangerous #car and #bike racing late at night, ignoring repeated #warnings from the police.… pic.twitter.com/6c5xkqw4Ei
— NewsMeter (@NewsMeter_In) May 24, 2026
దీనిని కూడా చదవండి : Hyderabad Lawyer Murder | హైదరాబాద్‌లో న్యాయవాది హత్య


