అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Lawyer Murder | హైదరాబాద్‌లో ఓ న్యాయవాది హత్య తీవ్ర కలకలం రేపింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ (Nampally Police Station) పరిధిలోని మాసబ్‌ట్యాంక్‌లో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను శనివారం ఉదయం తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. కారులో ఎక్కడానికి యత్నిస్తుండగా దుండగులు మరో కారులో వేగంగా వచ్చి ఢీకొన్నారు.
ఖాజా మొయినుద్దీన్ వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్నారు. తన ఇంటి నుండి బయటకు రాగానే న్యాయవాదిని
కారుతో ఢీ కొట్టి దుండగులు పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు.
Hyderabad Lawyer Murder | సీసీ కెమెరాలో రికార్డు
న్యాయవాదిని కారుతో ఢీకొన్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఖాజా మొయినొద్దీన్ ఇంట్లో నుంచి బయటకు రాగానే.. వేగంగా వచ్చి ఆయనను మరో కారుతో ఢీకొన్నారు. నిందితులు ఆయన కోసం మాటు వేసినట్లు తెలుస్తోంది. బయటకు రాగానే కారును వేగంగా తీసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న ఆయనను ఢీకొన్నారు. అనంతరం అక్కడి నుంచి పరారు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
A shocking incident was reported from #MasabTank, where #advocate #KhajaMohiuddin was allegedly killed after being rammed by a #car in a suspected targeted attack.
According to police, Mohiuddin had just stepped out of his house and was about to leave in his car on… pic.twitter.com/DWjfbHNjWp
— NewsMeter (@NewsMeter_In) May 23, 2026
ఇది కూడా చదవండి..: CM Yadagirigutta Visit | యాదగిరిగుట్టలో సీఎం పర్యటన.. వేద పాఠశాలకు శంకుస్థాపన


