అక్షరటుడే వెబ్‌డెస్క్: Amazon Pay Travel Deals | ప్రయాణ ప్రియులకు అమెజాన్ పే తీపి కబురు అందించింది. తన ప్రముఖ సేల్ ఈవెంట్ ‘ఇంపాజిబుల్ ట్రావెల్ డీల్స్’ను నవంబర్ 12 నుండి 26, 2026 వరకు 15 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా దేశీయ, అంతర్జాతీయ విమాన ( Flight )టికెట్లపై గరిష్ఠంగా 30 శాతం వరకు, హోటల్ బుకింగ్‌లపై 65 శాతం వరకు భారీ తగ్గింపులు అందుబాటులోకి రానున్నాయి. పండుగలు, సెలవుల సీజన్ వస్తున్న నేపథ్యంలో కస్టమర్లు తమ ప్రయాణ ప్రణాళికలను తక్కువ ఖర్చుతోనే సాకారం చేసుకోవడానికి ఈ ఆఫర్లను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
Amazon Pay Travel Deals | 65 శాతం ఆఫర్..
ఈ సేల్‌లో అనేక ప్రముఖ గమ్యస్థానాలకు చౌక ధరలకే విమాన టికెట్లు లభించనున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాల విషయానికొస్తే ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కు రూ.12,299, ముంబై నుంచి దుబాయ్‌కు రూ.13,999, కోల్‌కతా నుంచి హో చి మిన్ సిటీకి రూ.15,599 ప్రారంభ ధరలుగా నిర్ణయించారు. దేశీయ మార్గాల్లో ముంబై నుంచి గోవాకు రూ.3,099, బెంగళూరు నుంచి కొచ్చికి రూ.4,199, ముంబై నుంచి ఢిల్లీకి రూ.6,099 నుంచే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. హోటల్ బుకింగ్‌లలో దుబాయ్‌లోని ప్రసిద్ధ దుసిత్ థానీ హోటల్లో రూ.6,649కి, సింగపూర్ కార్ల్టన్ సిటీ హోటల్లో రూ.15,089 నుంచి బస చేయవచ్చు. అలాగే గోవాలో రూ.4,899, కొచ్చిలో రూ.3,549 నుంచే హోటల్ గదులు లభిస్తాయి.
Amazon Pay Travel Deals | క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు..
సేల్ వ్యవధిలో కస్టమర్లకు విమాన టికెట్లపై 15 శాతం, హోటళ్లపై 45 శాతం వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్న ప్రైమ్ సభ్యులకు విమాన, హోటల్ బుకింగ్‌లపై అదనంగా 5 శాతం, ప్రైమ్ సభ్యత్వం లేని వారికి 3 శాతం క్యాష్‌బ్యాక్ అందుతుంది. దీనికితోడు బస్ టికెట్ బుకింగ్‌లపై 17 శాతం వరకు తగ్గింపుతో పాటు ఫ్లాట్ రూ.100 క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కల్పించారు.
Amazon Pay Travel Deals | ప్రత్యేక ఎర్లీ బర్డ్ ఆఫర్లు..
కస్టమర్లందరికీ నవంబర్ 12, 13 తేదీల్లో ప్రత్యేక ఎర్లీ బర్డ్ ఆఫర్లు లభించనున్నాయి. ఇందులో విమాన టికెట్లపై 10 శాతం (గరిష్ఠంగా రూ.500 వరకు), హోటళ్లపై 10 శాతం (గరిష్ఠంగా రూ.10,000 వరకు), అలాగే రూ.250 కంటే ఎక్కువ విలువైన బస్ టికెట్లపై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే నవంబర్ 14 నుంచి మాత్రం కొన్ని ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కేవలం తొలిసారి అమెజాన్ పే ట్రావెల్ సేవలను ఉపయోగించే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
Amazon Pay Travel Deals | సులభమైన బుకింగ్స్..
అమెజాన్ పే ట్రావెల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 1,100కి పైగా ఎయిర్‌లైన్స్, 70 లక్షలకు పైగా హోటల్స్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉందని అమెజాన్ పే రివార్డ్స్ డైరెక్టర్ గిరీష్ కృష్ణన్ తెలిపారు. ఇందులో ప్రయాణికుల కోసం 24/7 కస్టమర్ సపోర్ట్, తక్కువ క్యాన్సిలేషన్ ఛార్జీలు, నచ్చిన సీటు ఎంపిక, ఎంపిక చేసిన బుకింగ్‌లపై భోజన వసతి, ‘ఇప్పుడే బుక్ చేసుకోండి.. తర్వాత చెల్లించండి’ (Book Now, Pay Later) వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆసక్తి గల కస్టమర్లు Amazon.in వెబ్‌సైట్‌లోని ‘ట్రావెల్’ విభాగం ద్వారా ఈ డీల్స్ పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Kamareddy Police Sports | క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు