Smoking Cessation Benefits | స్మోకింగ్ మానేసారా? అయితే లంగ్స్‌లో జరిగే అమేజింగ్ మార్పులు ఇవే

ఏళ్ల తరబడి ధూమపానం చేసేవారు.. “ఇన్నాళ్లు స్మోక్ చేశాం కదా, ఇప్పుడు మానేసినా ప్రయోజనం ఏంటి?” అని నిరాశపడుతుంటారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Smoking Cessation Benefits | ఏళ్ల తరబడి ధూమపానం చేసేవారు.. “ఇన్నాళ్లు స్మోక్ చేశాం కదా, ఇప్పుడు మానేసినా ప్రయోజనం ఏంటి?” అని నిరాశపడుతుంటారు. కానీ, ఇలాంటి అపోహలను తొలగిస్తూ ఆరోగ్య నిపుణులు ఓ అద్భుతమైన విషయాన్ని వెల్లడించారు. ఎప్పుడు స్మోకింగ్ మానేసినా శరీరం రక్షణ వ్యవస్థ వెంటనే మళ్లీ యాక్టివ్ అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Smoking Cessation Benefits | అద్భుత మార్పులు..

సిగరెట్ తాగడం ఆపేసిన క్షణం నుంచే శరీరంలో మార్పులు మొదలవుతాయి. ముఖ్యంగా పొగ ద్వారా ఊపిరితిత్తుల్లో ( Lung ) చేరే వేలాది హానికర రసాయనాల ప్రభావం తగ్గి.. శ్వాసకోశాల్లోని మురికిని శుభ్రం చేసే ‘సిలియా’ అనే సూక్ష్మ కణాలు మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తాయి. దీంతో ఊపిరితిత్తుల పనితీరు క్రమంగా మెరుగవుతుంది. దశాబ్దాల పాటు పొగతాగినప్పటికీ, ఎప్పుడైనా మానేస్తే ఆరోగ్యపరంగా ఎంతో కొంత మేలు జరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Smoking Cessation Benefits | పూర్తిగా సరిదిద్దుకోగలదా?

ఊపిరితిత్తులకు తమను తాము బాగుచేసుకునే అద్భుతమైన శక్తి ఉన్నప్పటికీ.. జరిగిన నష్టమంతా వంద శాతం పూర్తిగా పూడుతుందని చెప్పలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మోకింగ్ వల్ల గాలి గోణులు (Air sacs) దెబ్బతిన్నా, ఎమ్ఫిసిమా (Emphysema) లాంటి తీవ్ర సమస్యలు వచ్చినా, లేదా ఊపిరితిత్తుల కణజాలంపై మచ్చలు (Scarring) ఏర్పడినా అవి శాశ్వతంగా ఉండిపోతాయి. అంటే శరీరం కొంతవరకు నష్టాన్ని రికవర్ చేయగలిగినా, లోతైన నిర్మాణపరమైన నష్టం అలాగే ఉంటుంది.

Smoking Cessation Benefits | పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

ఈ అంశంపై అంతర్జాతీయంగా జరిగిన స్టడీస్ ఎంతో ఆశాజనకమైన విషయాలను వెల్లడించాయి. 2020లో ప్రముఖ ‘నేచర్ జర్నల్’‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. నిరంతరం పొగతాగేవారితో పోలిస్తే, మాజీ స్మోకర్ల శ్వాసకోశాల్లో ఆరోగ్యకరమైన, తక్కువ దెబ్బతిన్న కణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీన్నిబట్టి స్మోకింగ్ మానేస్తే ఊపిరితిత్తుల కణాలు కోలుకోగలవని స్పష్టమవుతోంది.

Smoking Cessation Benefits | ముఖ్యమైన చిట్కాలు..

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధూమపానానికి పూర్తిగా స్వస్తి పలకడంతో పాటు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి. అలాగే ఇతరులు వదిలే పొగ (పాసివ్ స్మోక్), వాయు కాలుష్యానికి దూరంగా ఉంటూ, పోషకాలు నిండిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా తగిన వ్యాక్సిన్లు వేయించుకోవడం మంచిది. ఒకవేళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా దీర్ఘకాలిక దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి:  Pilot Smith Machar | పైలట్ స్మిత్ మచ్చర్‌తో ఫోన్లో మాట్లాడిన మోదీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *