Amritsar Firing Incident | పంజాబ్​లో కాల్పులు.. ఏఎస్సైకి గాయాలు

పంజాబ్‌లో దీపావళి రాత్రి, బంగారానికి సంబంధించిన లావాదేవీ విషయంలో జరిగిన గొడవ హింసాత్మకంగా మారడంతో ఒక వ్యక్తి మరణించగా, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ కాల్పుల్లో గాయపడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amritsar Firing Incident | పంజాబ్‌ (Punjab)లోని అమృత్‌సర్‌లో దీపావళి రాత్రి, బంగారానికి సంబంధించిన లావాదేవీ విషయంలో జరిగిన గొడవ హింసాత్మకంగా మారడంతో ఒక వ్యక్తి మరణించగా, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) కాల్పుల్లో గాయపడ్డారు.

బంగారానికి సంబంధించిన లావాదేవీ విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ మాటల యుద్ధం ముదిరి, చివరికి కాల్పులకు దారితీసింది. ఈ ఘటన సుల్తాన్‌విండ్ రోడ్డులోని ‘రంఝే ది హవేలీ’ సమీపంలో జరిగింది. బి-డివిజన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) హర్నేక్ సింగ్ అక్కడే ఉన్నారు. కాల్పుల మధ్య చిక్కుకున్న ఆయన తొడ భాగంలో రెండు బుల్లెట్లు తగిలాయి. తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. మరో వ్యక్తి చనిపోయాడు.

Amritsar Firing Incident | బంగారం కోసం..

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) రవీందర్ సంధు మీడియాతో మాట్లాడుతూ, ఇద్దరు సోదరులు మరియు వారి స్నేహితుల మధ్య ఈ గొడవ జరిగిందని తెలిపారు. బాధితుడైన ప్రతాప్ సింగ్ తన స్నేహితులకు 1,400 గ్రాముల బంగారాన్ని ఇచ్చాడని, అదే వివాదానికి కారణమైందని చెప్పారు. ఆదివారం రెండు వర్గాల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. అందులోకి ఓ వర్గం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏఎస్సై ఘటనా స్థలానికి వచ్చారు. పోలీసులు అక్కడికి రాగానే.. నిందితులు కాల్పులు జరిపారు.

ఇది కూడా చదవండి..: Delhi Diwali Tragedy | పండుగ వేళ విషాదం.. బాలుడి కడుపులోకి దూసుకెళ్లిన తారాజువ్వు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *