అక్షరటుడే గాంధారి: RTC Bus Accident | ఆర్టీసీ బస్సు కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఘటన గాంధారి మండలంలోని గుడిమెట్ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
RTC Bus Accident | బస్సులో 16మంది ప్రయాణికులు..
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి (Kamareddy) నుండి 16మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు బాన్సువాడ వైపు బయలుదేరింది. అయితే గుడిమెట్ శివారు ప్రాంతంలోకి రాగానే బస్సు వెనకాలే వస్తున్న మరో కారు బస్సును ఓవర్టేక్ చేయబోగా ఈ హడావుడిలో రెండు వాహనాలు రోడ్డుకిందికి దూసుకెళ్లాయి. ఈ క్రమంలో ఇద్దరికీ స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బాధితులను బస్సులోనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంకా పూర్తి వివరాలు తెలియ చేయాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Khilla Raghunath Temple Fire | ఖిల్లా రఘునాథ ఆలయ ముఖద్వారం వద్ద అగ్నిప్రమాదం..