Women Kabaddi Coach | రాష్ట్ర మహిళా కబడ్డీ జట్టుకు కోచ్​గా మీసాల ప్రశాంత్

జిల్లా కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​లో భాగంగా రాష్ట్ర కబడ్డీ జట్టుకు కోచ్​గా జిల్లా కబడ్డీ కోచ్​ మీసాల ప్రశాంత్​ నియమితులయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Women Kabaddi Coach | రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (Telangana) ఆధ్వర్యంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్​ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా తెలంగాణ మహిళా కబడ్డీ జట్టుకు ముగ్గురితో కూడిన సెలెక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ జట్టు కోచ్​ మీసాల ప్రశాంత్​ రాష్ట్ర కబడ్డీ జట్టు కోచ్​గా నియమితులయ్యారు.

Women Kabaddi Coach | శిక్షకుడిగా మీసాల ప్రశాంత్​..

ఈ ఎంపిక కమిటీలో అంతర్జాతీయ కబడ్డీ జట్టు అర్జున అవార్డు గ్రహీత నీతా దాడివే, ఇండియన్ రైల్వే జట్టు శిక్షకురాలు మంగళ దేశాయి, జిల్లా కబడ్డీ కోచ్​గా విధులు నిర్వహిస్తున్న మీసాల ప్రశాంత్​ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కబడ్డీ క్రీడాకారులకు ఎంపికలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన 30మంది క్రీడాకారుల ఎంపిక చేసే బాధ్యత ఈ కమిటీదే. ఈ సందర్భంగా మూడు ఫేస్​లుగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. మొదటి శిక్షణ శిబిరం పూర్తి చేసుకుని వచ్చిన ప్రశాంత్​ను జిల్లా కబడ్డీ సంఘం అభినందించింది. ఈ నియామకం పట్ల జిల్లా యువజన క్రీడా అధికారి పవన్ కుమార్, జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు అంధ్యాల లింగయ్య, సురేందర్, సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: RTC Bus Accident | అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు,కారు.. తప్పిన పెనుప్రమాదం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *