అక్షరటుడే, ఇందూరు: 18 Hours Power Supply | జిల్లాలో వ్యవసాయ రంగానికి లో-వోల్టేజ్ సమస్య లేకుండా 18 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ట్రాన్స్‌కో ఎస్ఈకి వినతిపత్రం అందజేశారు.
18 Hours Power Supply | 6 లక్షల ఎకరాల్లో సాగు..
దినేష్ (Dinesh Kulachari) మాట్లాడుతూ. జిల్లావ్యాప్తంగా రైతాంగం సుమారు 2.5 లక్షల వ్యవసాయ పంపుసెట్ల కింద దాదాపు 6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారని తెలిపారు. అయితే ప్రభుత్వం రైతులకు అవసరమైన విద్యుత్‌ను అందించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న అరకొర 7 నుంచి 8 గంటల కరెంట్ కూడా లో-వోల్టేజీతో వస్తుండటంతో వ్యవసాయ బోర్ల మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఎలాంటి లో-వోల్టేజీ, సరఫరా అంతరాయాలు లేకుండా రోజుకు 18 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, ప్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, తిరుపతిరెడ్డి, గంగారెడ్డి, కర్క గంగారెడ్డి, తోట చిన్నయ్య, రాజేశ్వర్ రెడ్డి, అన్నం గోపి, పద్మా రెడ్డి, జగన్ రెడ్డి, ఆనంద్, శంకర్ రెడ్డి, నాయిడి రాజన్న, కల్పె చిరంజీవి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Ganesh Festival Nizamabad | గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి..: మేయర్ ఉమారాణి