Delhi Jantar Mantar Protest | ఢిల్లీలో హై టెన్షన్.. జంతర్​ మంతర్​ వద్ద భారీ భద్రత

దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Delhi Jantar Mantar Protest | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE) పరీక్షల లీకేజీల వ్యవహారంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు సీజేపీ సిద్ధమైంది. సభ నిర్వహణకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

Delhi Jantar Mantar Protest | ఢిల్లీకి చేరుకున్న అభిజీత్​ దీప్కే

జంతర్​ మంతర్​ వద్ద ఆందోళన నేపథ్యంలో సీజేపీ ఫౌండర్​ అభిజీత్​ దీప్కే అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. ఆందోళన ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారని ట్వీట్​ చేశారు. ఆయన జంతర్​ మంతర్​కు వెళ్లనున్నారు. ఇప్పటికే కొందరు యువకులు ఆందోళన చేపట్టనున్న ప్రాంతానికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Delhi Jantar Mantar Protest | కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్​

నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE) లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) పదవికి రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా.. నిరుద్యోగ యువత సమస్యలపై సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. కాక్రోచ్ పార్టీ నిరసనకు పలువురు దేశీయ రాజకీయ ప్రముఖులు కూడా తమ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి..: Annamalai New Party | అన్నామలై కొత్త పార్టీ.. రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటన!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *