Satapur Cattle Market | సాటాపూర్​ పశువుల అంగడిని తనిఖీ చేసిన సీపీ..

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Satapur Cattle Market | బోధన్​ నియోజకవర్గ పరిధిలోని సాటాపూర్​ అంగడిని సీపీ సాయిచైతన్య (cp sai chaitanya) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు అంగడిలో పశువుల క్రయ విక్రయాలను సాటాపూర్​ జీపీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

Satapur Cattle Market | బక్రీద్​ నేపథ్యంలో..

బక్రీద్ (bakrid)​ పండుగ నేపథ్యంలో సాటాపూర్​ సంతను తనిఖీ చేసిన సీపీ అనంతరం.. వెటర్నరీ డాక్టర్ల (veterinary checks) చెకింగ్ పాయింట్‌ను కూడా తనిఖీ చేశారు. వెటర్నరీ ఆఫీసర్లు ఇస్తున్న సర్టిఫికెట్​ల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వెటర్నరీ అధికారులు ప్రతి జంతువుకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అలాగే అక్రమ రవాణా, అనారోగ్య పశువుల విక్రయాలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Satapur Cattle Market | చెకింగ్​ పాయింట్ల వద్ద..

చెకింగ్ పాయింట్ల వద్ద పోలీసులు, వెటర్నరీ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పండుగ సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా పోలీస్ శాఖ (nizamabad Police) అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని కమిషనర్ పేర్కొన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ ఎస్సై చంద్ర మోహన్, జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రోహిత్ రెడ్డి, మండల వెటర్నరి డాక్టర్ విఠల్, ప్రమోద్, నరేందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Caste Names Change | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కులాల పేర్లు మార్పు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *