నిజామాబాద్Yoga For Health | యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఎన్​​ఎస్​సీఎన్​పీఎల్​ సహాయక కార్యదర్శి రజనీకాంత్​

Yoga For Health | యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఎన్​​ఎస్​సీఎన్​పీఎల్​ సహాయక కార్యదర్శి రజనీకాంత్​

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎన్​​ఎస్​సీఎన్​పీఎల్ సహాయక కార్యదర్శి రజనీకాంత్ అన్నారు. ఆరోగ్య రక్ష యోగా నేచర్ కేర్ సెంటర్​లో బహుమతి ప్రధాన కార్యక్రమానికి ఆయన పాల్గొన్నారు.

అక్షరటుడే, ఇందూరు: Yoga For Health | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని (Yoga) నిజామాబాద్​ సెక్యూరిటీ కౌన్సిల్​ (Nizamabad Security Council) నిజామాబాద్​ ప్రీపియర్​ లీగ్​ (ఎన్​​ఎస్​సీఎన్​పీఎల్)​ సహాయక కార్యదర్శి, కాకతీయ విద్యాసంస్థల (Kakatiya Educational Institutions) డైరెక్టర్​ రజనీకాంత్ అన్నారు. ఎన్​ఎస్​సీఎన్​పీఎల్ ​(NSCNPL) ఆధ్వర్యంలో ఏప్రిల్​ 25వ తేదీ నుంచి 28 వరకు సుభాష్​నగర్​లోని కాకతీయ ఒలింపియాడ్​లో జిల్లాస్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. అరంతరం ఆదివారం ఆరోగ్య రక్ష యోగా నేచర్ కేర్ సెంటర్​లో బహుమతి ప్రధాన కార్యక్రమానికి ఆయన ​ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Yoga For Health | యోగాతో చదువుపై ఏకాగ్రత..

ఈ సందర్భంగా రజనీకాంత్​ మాట్లాడుతూ.. యోగాతో చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు. విద్యార్థులు చదువులో చురుకుగా ఉండేందుకు తప్పకుండా యోగా చేయాలని సూచించారు. ఎన్​ఎస్​సీఎన్​పీఎల్ మరో సహాయక కార్యదర్శి హితిన్​ బీమాని మాట్లాడుతూ.. కౌన్సిల్​ ఆధ్వర్యంలో పోటీలను (Nizamabad Yoga) నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీలను మూడు కేటగిరీల్లో నిర్వహించగా సుమారు 250మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఐఎస్​వో పవన్​కుమార్​, ఆరోగ్య రక్ష నిర్వాహకురాలు డాక్టర్​ ఐశ్వర్య కాలే, యోగా అసోసియేషన్​ కార్యదర్శి గంగాధర్​, గురువులు కమల వాణి, గాయత్రి, లోహిదాస్, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు. పోటీలలో గెలుపొందిన వారికి నగదును బహుకరించారు. అనంతరం యోగా పోటీల నిర్వహణకు కృషి చేసిన నాగచైతన్యను ప్రత్యేకంగా అభినందించారు.

ఇది కూడా చదవండి: Yadadri Power Plant Fire|యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెద్ద ముప్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Matrimonial fraudster arrested | మెడలో తాళి కడతానని.. అకౌంట్ ఖాళీ చేస్తాడు.. మాట్రిమోని కిలాడీ ‘కామేషు’ వేషాలు మామూలుగా లేవుగా!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Matrimonial fraudster arrested | పెళ్లి పీటలు ఎక్కించి, జీవితాంతం...

ACB Raids HMWSSB GM | జలమండలి జీఎంకు ఏసీబీ షాక్‌.. కుప్పలుగా నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB Raids HMWSSB GM | భాగ్యనగరంలో అవినీతి...