Yadadri Power Plant Fire|యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెద్ద ముప్పు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Yadadri Power Plant Fire|నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ (YATP) లో ఆదివారం నాడు ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని మూడో యూనిట్‌కు సంబంధించిన టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇంజినీర్లు, కార్మికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

Yadadri Power Plant Fire|ఆయిల్ లీకేజీయే కారణం..

బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద లూబ్రికేషన్ ఆయిల్ (చమురు) లీక్ కావడం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆయిల్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఈ ప్రమాద తీవ్రతకు పంప్ పరిసరాల్లోని కంట్రోల్ కేబుల్స్‌తో పాటు కొన్ని ముఖ్యమైన వాల్వ్‌లు కాలిపోయి దెబ్బతిన్నాయి.

Yadadri Power Plant Fire|సురక్షితంగా ప్రధాన యంత్రాలు..

ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయిన ప్లాంట్ సిబ్బంది, అగ్నిమాపక యంత్రాలు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చాయి. దీంతో ప్లాంట్‌లోని ప్రధాన యంత్రాలైన మెయిన్ టర్బైన్లు, బాయిలర్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. తృటిలో భారీ ముప్పు తప్పినట్లయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సమాచారం అందుకున్న జెన్‌కో (TGGENCO) ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవడంతో పాటు, నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు అంతర్గత విచారణకు ఆదేశించారు.

ఇది కూడా చదవండి: iBomma website | ఐ బొమ్మ వెబ్​సైట్​పై ఫిర్యాదు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *